Konda Surekha: తెలంగాణ ఉద్యమం క్రెడిట్ కోసమే కేటీఆర్ రాష్ట్రానికి వచ్చారు..! 17 d ago
ఫామ్‌హౌస్‌లో పడుకుని కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు. కాబట్టే కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు. కేటీఆర్ మాట్లాడే భాష వాళ్ల నాయన కూడా ఎప్పుడూ మాట్లాడలేదని మండిపడ్డారు. తెలంగాణ వస్తుంది అని తెలిశాకే అమెరికా నుంచి నువ్వు, నీ చెల్లి తట్టబుట్ట సర్దుకుని వచ్చారని, క్రెడిట్ కోసమే రాష్ట్రానికి వచ్చారని ఎద్దేవ చేశారు.